- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా’ అనుమానితులు 141..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.ఇప్పటికే చైనాలో దీని బారిన పడి చాలా మంది మృతిచెందారు. వైరస్ సోకిన వారి సంఖ్యకూడా రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితుల సంఖ్య 141కి చేరింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 83మంది ఉండగా,ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 58మంది ఉన్నారు.కాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వారికోసం 5289 థర్మల్ స్ర్కీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కాగా, శనివారం ఒక్కరోజే 689మందికి థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించారు. కరోనా అనుమానితులు 70మందికి వైరాలజీ పరీక్షలు చేయగా అందులో 62మందికి కరోనా లేదని వైద్యులు నిర్దారించారు. మిగిలిన 8మందికి సంబంధించి రిపోర్టులు రావాల్సిఉంది. ఇదిలా ఉండగా తెలంగాణ వైద్యశాఖ కరోనా పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.