జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డికి కరోనా పాజిటివ్‌

by Shyam |
ZP chairperson Sunita Reddy
X

దిశ, వికారాబాద్‌: జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డికి కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో శుక్రవారం చైర్‌పర్సన్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మూడ్రోజుల కిందట కోట్‌పల్లి పర్యటనలో తనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ప్రకటన విడుదల చేశారు. తనను కలవడానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు, నాయకులు, శ్రేయోభిలాషులు ఆందోళన పడొద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed