మాజీ ఎమ్మెల్సీ కుటుంబానికి కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2020-08-02 12:11:28.0  )
మాజీ ఎమ్మెల్సీ కుటుంబానికి కరోనా పాజిటివ్
X

దిశ, కరీనగర్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు అతని భార్య
, ఇంట్లో వర్కర్లు, కుటుంబ సభ్యులు మొత్తం 8 మందికి కరోనా వచ్చినట్టు వైద్యులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కుటుంబానికి పాజిటివ్ రావడంతో మరోసారి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో కరోనా టెన్షన్ మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed