కరోనా ఎఫెక్ట్: రహస్యంగా చికిత్స పొందుతున్న మావోయిస్టులు

by Anukaran |   ( Updated:2021-05-10 23:47:40.0  )
Corona positive, Maoists
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, దళ సభ్యులకు భారీగా కరోనా సోకింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 70 నుంచి 100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకినట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి.

అయితే.. సమాచారం అందిన స్థానిక ఎస్పీ నయీం ఆస్మి మావోయిస్టులకు కీలక సూచనలు చేశారు. కరోనా సోకిన మావోయిస్టులెవరైనా జనజీవన స్రవంతిలోకి వచ్చి కరోనా చికిత్స పొందవచ్చు అని సూచించారు. మీ మూర్ఖత్వంతో ఇతర దళ సభ్యుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని అన్నారు. మావోయిస్టు పార్టీని వదిలేసి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్ధికంగా కూడా ఆందుకుంటామని భరోసా ఇస్తున్నారు.

కాగా, కరోనా సోకిన మావోయిస్టులు తెలంగాణ సరిహద్దులో ఉన్న దంతేవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల పరిధిలోని గ్రామాల్లో రహస్యంగా చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. అంతేగాకుండా.. వారిలో కొంతమంది మావోయిస్టుల పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు అరెస్టు చేస్తారేమో అన్న భయంతో మెరుగైన వైద్యం కోసం బయటకు రావాలంటే వారు భయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed