తెలంగాణలో కరోనా కలకలం..15 మంది విద్యార్థులకు పాజిటివ్

by Sridhar Babu |
తెలంగాణలో కరోనా కలకలం..15 మంది విద్యార్థులకు పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఇప్పటికే చాలా కాలేజీల్లో, గురుకుల పాఠశాలలో కరోనా కేసులు విపరీతంగా నమోదుకాగా, తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది.
రోజూవారి టెస్టులలో భాగంగా కళాశాలలో కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో19 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా,15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు. రెసిడెన్షియల్ కళాశాల‌లో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బుధవారం మరోసారి వీరందరికీ ఆర్టీపీసీ ఆర్ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story