ఏపీ బీజేపీ కీలక నేతకు కరోనా పాజిటివ్

by srinivas |
ఏపీ బీజేపీ కీలక నేతకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మరి దారుణంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంత్రి ప్రజాప్రతినిధులు మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి, ఇటీవల బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story