ఏపీలో కరోనా @ 483

by srinivas |
ఏపీలో కరోనా @ 483
X

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ తన విస్తృతిని పెంచుకుంటోంది. రోజు రోజుకీ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ రాష్ట్ర వాసులను ఆందోళనలోకి నెడుతోంది. దీంతో ఏపీలో కరోనా కేసులు ఐదు వందలకి చేరువయ్యాయి. సామాజిక దూరంతో కట్టడి అవుతుందనుకుంటే.. ఎన్ని ఆంక్షలు విధించినా కరోనాను మాత్రం కట్టడి చేయడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

గుంటూరులో కరోనా కేసులు సెంచరీ మార్కు దాటేశాయి. దీంతో గుంటూరు వాసుల్లో గుబులు పట్టుకుంది. ఏపీలో మొత్తంగా 483 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్క గుంటూరులోనే ఏకంగా 114 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కాలేదు.

మరోవైపు కరోనా మహమ్మారితో ఏపీలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా, 16 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గుంటూరు తర్వాత 91 కేసులతో కర్నూలు రెండో స్థానంలో ఉండగా, నెల్లూరు (56), కృష్ణా (44), ప్రకాశం (42) జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరిలో అత్యల్పంగా 17 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

Tags: corona virus, covid-19, andhra pradesh, amaravati, health department

Advertisement

Next Story

Most Viewed