నల్లమలను భయపెడుతున్న కరోనా..

by Shyam |
నల్లమలను భయపెడుతున్న కరోనా..
X

దిశ, అచ్చంపేట: మొన్నటివరకూ పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా మహమ్మారి నేడు ఆ పట్టాలు దాటి నల్లమల ప్రాంతంలోని పల్లెలను కరోనా భూతం భయభ్రాంతులను చేస్తుంది. గత నాలుగు రోజుల క్రితం ఏజెన్సీ ప్రాంతంలో అచ్చంపేట పట్టణంలో కరోనా కేసులు ఒకే రోజు 12 నమోదు కావడం, అందులో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు మరో డాక్టర్‌‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరిని కలిసిన ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా నేడు అచ్చంపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మెన్ మరియు అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన మహిళా కూరగాయల వ్యాపారికి పాజిటివ్‌గా నమోదు అయ్యిందని జిల్లా వైద్యాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానిక వైద్య సిబ్బంది బయటకు వెళ్లకుండా ఉండాలని తగిన సూచనలు చేశారు. ఇద్దరికీ ప్రాథమిక కాంటాక్ట్ అయినవారి లిస్టును తయారు చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. మహిళా కూరగాయల వ్యాపారి ఉంటున్న కాలనీలో గ్రామపంచాయతీ వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో శానిటేషన్ చేశారు. రోజురోజుకూ నల్లమల ప్రాంతంలోని పలు గ్రామాలకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అమ్రాబాద్, పదర మండలాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు నమోదు అయినంత మాత్రాన ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని, ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించినప్పుడే కరోనాను ఎదుర్కొంటామని వైద్యులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed