- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతకంతకూ పెరుగుతున్న కేసులు, మరణాలు
దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. తొలి మూడు లాక్‌డౌన్‌లతో పోలిస్తే నాల్గో లాక్‌డౌన్ కాలంలోనే ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి కట్టడి కావడం లేదు. కేంద్రం సైతం రాష్ట్రాలపైనే భారం వేసింది. గడచిన 24 గంటల వ్యవధిలో దేశం మొత్తం మీద 6,387 కొత్త కేసులు, 170 మరణాలు సంభవించాయి. నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఐదంకెలు దాటగా, మరో 13 రాష్ట్రాల్లో నాలుగంకెల స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ, ఏపీలో సైతం మొత్తం కేసుల సంఖ్య రెండు వేల మార్కు దాటింది. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని తీరులో ఒక్కసారిగా మూడంకెల స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. విమానాల ద్వారా వస్తున్న ప్రయాణికుల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది. వందే భారత్ విమానాల ద్వారా విదేశాల నుంచి వచ్చిన సుమారు 1700 మందిలో 94 మంది సౌదీ నుంచి వచ్చినవారికి, 30 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఇదే తరహాలో విమానాల ద్వారా వచ్చినవారిలో పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తేలింది.
భారత్ :
మొత్తం కేసులు : 1,51,567
రికవరీ : 64,426
మృతులు : 4,337
తెలంగాణ :
మొత్తం కేసులు : 2,139
రికవరీ : 1,321
మృతులు : 63
ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 2,787
రికవరీ : 1,913
మృతులు : 58