- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాల్వంచ కేటీపీఎస్‌లో ఇంజనీర్‌కు కరోనా

దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లో కరోనా కలకలం మొదలైంది. కేటీపీఎస్‌లో పనిచేస్తున్న ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఉద్యోగులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా ఇంజనీర్, జలుబు, దగ్గు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంజనీర్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శనివారం కొవిడ్ ఫలితాల్లో పాజిటివ్ రావడంతో ఆయనకు సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించే పనిలో జిల్లా వైద్యాధికారులు ఉన్నారు.
వారం రోజుల క్రితం సదరు ఇంజనీర్ పనిమీద హైదరాబాద్‌లోనే ఉండి కొంతమందిని కలవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన కరోనా వైరస్ బారిన పడినట్లుగా కుటుంబ సభ్యులు వైద్యాధికారులకు వెల్లడించారు. అలాగే, పాల్వంచలో ఇంజనీర్ ఉంటున్న అపార్ట్‌మెంట్లోని వారందరిని వైద్యాధికారులు హోం క్వారంటైన్‌లో ఉండేలా ఆదేశించారు. అతిని కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇంజనీర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.