గుంటూరులో కరోనా కలకలం

by srinivas |
గుంటూరులో కరోనా కలకలం
X

దిశ, ఏపీ బ్యూరో: దక్షిణాది మొత్తానికి మిర్చిని సరఫరా చేసే గుంటూరు మిర్చి యార్డులో కరోనా కలకలం రేగింది. యార్డులో వ్యాపారం నిర్వహించే ముగ్గురికి వైరస్ పాజిటివ్ గా తేలడంతో యార్డును మూసివేశారు. ఇక్కడికి నిత్యమూ వందల సంఖ్యలో రైతులు తమ మిర్చి పంటను తెచ్చి అమ్ముతుంటారన్న సంగతి తెలిసిందే. యార్డులో వ్యాపారులకు కరోనా సోకడంతో, వారు వ్యాపారం నిర్వహించే ప్రాంతాన్ని బారికేడ్లతో నియంత్రించారు. శని, ఆదివారాలు ఎలానూ మార్కెట్ కు సెలవు కాబట్టి, సోమవారం నాడు పరిస్థితిని సమీక్షించి, యార్డును తెరుస్తామని అధికారులు తెలిపారు. ఈలోగా, యార్డు మొత్తాన్నీ సోడియం హైపోక్లోరైడ్ తో శానిటైజ్ చేస్తున్నామని అన్నారు. వైరస్ సోకిన వ్యాపారుల వద్దకు వచ్చిన రైతులు, దళారీలు, కూలీలను గుర్తించి, వారిని తగు జాగ్రత్తలతో ఉండాలని సూచించినట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed