ఇంటికి పంపాలంటూ కరోనా రోగుల ఆందోళన

by srinivas |
ఇంటికి పంపాలంటూ కరోనా రోగుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: తమకు మూడు రోజుల నుంచి భోజనం, మందులు ఇవ్వడం లేదంటూ కరోనా రోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. తమను డాక్టర్లు పట్టించుకోవటం లేదని.. క్వారంటైన్ సెంటర్ నుంచి ఇంటికి పంపించాలని కరోనా పెషంట్స్ ఆందోళన బాట పట్టారు. కాగా, గూడూరులో కరోనా విజృంభిస్తుంది. తాజాగా శనివారం మరో 85 కేసులు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Next Story