రికవరీలో మనము లేము

by Shamantha N |
రికవరీలో మనము లేము
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అదేవిధంగా కరోనా సోకి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ రోజుతో రికవరీ రేటు 63.02 శాతానికి పెరిగింది. అయితే మన దేశ సరాసరి రికవరీ రేటు కంటే 19 రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో కేంద్రపాలిత ప్రాంతం లఢక్ మొదటి స్థానంలో ఉంది. టాప్ 10 జాబితాలో ఇరు తెలుగు రాష్ట్రాలు స్థానాన్ని దక్కించుకోలేదు. అయితే.. నేటితో దేశ మొత్తంగా 5,53,470 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 18,850 మంది రికవరీ అయ్యారు.

కరోనా రికవరీ అయిన టాప్ టెన్ రాష్ట్రాలు ఇవే..

లఢక్ – 85.45%, ఢిల్లీ – 79.98% , ఉత్తరాఖండ్ – 78.77%, ఛత్తీస్ గఢ్ – 77.68%, హిమాచల్ ప్రదేశ్ – 76.59%, హర్యాణా – 75.25%, ఛండీగఢ్ – 74.60%, రాజస్థాన్ – 74.22%, మధ్యప్రదేశ్ – 73.03%, గుజరాత్ – 69.73%.

Advertisement

Next Story

Most Viewed