- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్లు: ఈసీ
న్యూఢిల్లీ: 65ఏళ్లు పైబడిన వయోధికులకు, కరోనా పేషెంట్లు, క్వారంటైన్‌లోని కరోనా అనుమానితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్-నవంబర్‌లలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈసీ ఈ ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికల కమిషన్ పలునిబంధనలు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఓటర్లకు అనుకూలంగా ఈ నిర్ణయాలను వెల్లడించింది. వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న 65ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ సమస్యల్లాంటి వ్యాధులతో బాధపడుతున్నవారికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఈసీ తెలిపింది. ఇప్పటివరకు 80ఏళ్లు పైబడినవారికి, అత్యవసర సేవల్లో వేరే రాష్ట్రంలో ఉన్నవారి కోసం ఈ సదుపాయాన్ని ఈసీ కల్పించింది. తాజాగా, కరోనా పేషెంట్లు సహా పలువురికి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ప్రకటన చేసింది.