తప్పించుకున్న కరోనా పేషెంట్.. తొర్రూర్‌లో ప్రత్యక్షం

by vinod kumar |
తప్పించుకున్న కరోనా పేషెంట్.. తొర్రూర్‌లో ప్రత్యక్షం
X

దిశ, వరంగల్: హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రి నుంచి తప్పించుకున్న కరోనా పాజిటివ్ వ్యక్తి మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ బస్టాండ్‌లో ప్రత్యక్షమయ్యాడు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన పున్నం వెంకన్నగా పోలీసులు గుర్తించారు. ఈయన ఎల్బీనగర్ నుంచి సూర్యాపేటకు, సూర్యాపేట నుంచి తొర్రూరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్టు సమాచారం. అతడి తమ్ముడు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుడు ప్రయాణించిన ఆర్టీసీ బస్సును గుర్తించేందుకు వర్ధన్నపేట పోలీసులు తనిఖీలు చేపట్టి.. ఎట్టకేలకు పట్టుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed