- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్పత్రిలో కరోనా పేషెంట్ బర్త్ డే
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే కరోనా సోకినవారిలో వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరీ దారుణం. దాని ప్రభావావికి దారుణంగా అల్లాడిపోతున్నారు. మరో విషయమేమిటంటే.. కరోనా సోకి రికవరీ అయిన వృద్ధులు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ముంబైలో కరోనా బారిన పడిన ఓ వృద్ధుడు రికవరీ అయ్యాడు. అంతేకాదు అతను ఆస్పత్రిలోనే పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ కార్యక్రమం ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో జరగడం గమనార్హం. విషయానికి వస్తే.. ముంబైకి చెందిన అర్జున్ గోవింద్ నారింగ్రేకర్ అనే రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టార్. ఆయనకు ఇటీవలే కరోనా సోకింది. దీంతో అతను ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా కేర్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అలా అతను మెల్లమెల్లగా కరోనా నుంచి కోలుకున్నారు. ఐతే.. బుధవారం అతని పుట్టినరోజు. ఈ విషయం ఆస్పత్రి డాక్టర్స్ కు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు, సిబ్బంది ఆస్పత్రిలో అతని బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సమయంలో అతని ఆనందం అంతా ఇంతా కాదు. అయితే అతను ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.