ఒకే రోజు 75 కేసులు.. ఇద్దరి మృతి

by vinod kumar |
ఒకే రోజు 75 కేసులు.. ఇద్దరి మృతి
X

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత వైరస్ కేసుల నమోదులో వేగం పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 75 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతిచెందారు. మృతులు సికింద్రాబాద్, షాద్‌నగర్‌కు చెందిన వారు. ఆయా ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాయి. తెలంగాణలో కేసుల సంఖ్య 229 చేరుకోగా, ఇప్పటివరకు 11 మంది మృతిచెందారు. వైరస్ బారి నుంచి కోలుకోవడంతో మరో 15 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకు వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 32గా ఉంది. మృతులు, కోలుకున్న వారిని మినహాయిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో 186 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Tags: corona out break, telangana state, 75 cases in a single day, two deaths, 15 patients recovered

Advertisement

Next Story