- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలం ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 సోకిన వ్యక్తితో టాయ్‌లెట్ పంచుకోవాల్సి వస్తే… ఆ వైరస్ సోకే ప్రమాదముందా? సిద్ధాంతపరంగా చూస్తే ఉందనే చెప్పాలి. కానీ ప్రాక్టికల్‌గా ఇప్పటివరకు అలాంటి కేసులేవీ బయటపడలేదు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రచురించిన సమాధానాల ప్రకారం కరోనా మహమ్మారి ఇంతలా ప్రబలడానికి మలం ద్వారా వైరస్ వ్యాప్తించడం అసలు కారణమే కాదని ఉంది. ఇది ప్రధానంగా రోగి దగ్గడం లేదా తుమ్మడం ద్వారా వ్యాపిస్తుందని తెలిపింది. అలాగే రోగి ముట్టుకున్న వస్తువులను ముట్టుకోవడం లేదా రోగితో ప్రత్యక్ష, పరోక్ష తాకిడి వల్ల కూడా వ్యాపిస్తుందని పేర్కొంది.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం కరోనా సోకిన వ్యక్తి మలం శాంపిల్స్‌లో వైరస్ జాడలు కనిపించినప్పటికీ, అవి వ్యాప్తి చెందే అంత ప్రభావవంతంగా లేవని తెలిపింది. దీంతో మలం ద్వారా కొవిడ్ 19 వ్యాపిస్తుందా లేదా అనే విషయం గురించి ఇంకా స్పష్టత రాలేదు. అంతేకాకుండా, గతంలో సార్స్, మెర్స్ వంటి వ్యాధులు కూడా మలం ద్వారా వ్యాపించిన దాఖలాలు చాలా తక్కువని నివేదికలు చెబుతున్నాయి. అలాగే కొవిడ్ 19 కూడా ఇప్పటివరకు మలం ద్వారా వ్యాపించినట్లు కేసులు రికార్డవలేదు. కాబట్టి కొవిడ్ 19 వచ్చిన వారితో టాయ్‌లెట్ పంచుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు. అయినప్పటికీ వ్యక్తిగత శుభ్రత పాటించడం మాత్రం తప్పనిసరి.
Tags: Corona, covid, faecal, infection, toilet, virus, public, panic