యాచకులకు కరోనా కిట్లు

by srinivas |
యాచకులకు కరోనా కిట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నివారణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ల మీద ఉండే యాచకులకు కరోనా వస్తే.. వ్యాప్తి తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నందునా.. వారికి దానం చేయడానికి ఎవరికి చేతులు రావడం లేదు. అంతేకాకుండా యాచకులు కరోనా జాగ్రత్తలు తీసుకోవడంలో వారి ఆర్థిక స్థోమత చాలదు. అయితే, వారందరికీ కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో రూ. 70 విలువగల రెండు సబ్బులు, 6 మాస్కులను అందజేస్తున్నారు. ముందుగా కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1991 బెగ్గర్ ఫ్యామిలీలను గుర్తించిన అధికారులు వారికి కిట్లను అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed