- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల.. ఫ్లాష్‌బ్యాక్‌లోకి!
దిశ, వెబ్ డెస్క్ : మనలో ఎవరైనా.. జీవితంలో ఇన్నిరోజులు ఇలా ఇంటికే పరిమితమవుతామని ఊహించారా? కలలో కూడా అనుకోని విషయాన్ని కరోనా లాక్‌డౌన్ తీర్చేసింది. ఇంకా లాక్డౌన్ కొనసాగుతోంది. ఒక్కసారిగా లైఫ్ అంతా మారిపోయింది. షేక్ హ్యాండ్ నుంచి మొదలుపెడితే షేర్ చేసుకుని తినేదాకా.. అన్నింటికీ కరోనా బ్రేకేసింది. ఫ్రెండ్స్, ఆత్మీయులు, బంధువులెవరినీ కలవనీయకుండా చేసింది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. కరోనా లాక్‌డౌన్ కారణంగా కలిగిన సైడ్ ఎఫెక్ట్స్‌లో కొన్ని సానుకూలాంశాలు లేకపోలేదు. మన కుటుంబసభ్యులతో ఇదివరకటి కన్నా ఇంకా క్లోజ్‌గా, మరింత ఆనందంగా గడిపేందుకూ అవకాశం ఇచ్చింది.
బాల్యస్మృతులను తలచుకుంటే…
మన బాల్యస్మృతులను ఎప్పుడైనా తలచుకుంటే ఎంత బాగుంటుందో… ఒక్కసారిగా తన్మయత్వం పొందుతాం కదా.. అంతలోనే ‘ఆ రోజులు మళ్లీ తిరిగిరావు.. అప్పడే లైఫ్ ఎంతో ఆనందంగా ఉండేదని అనుకుంటాం. మరి ఒక్కసారిగా ఆ రోజులు మళ్లీ తిరిగొస్తే? వాస్తవానికి కరోనా మన ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లింది. ఆ రోజుల్లో ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా జోకులేసుకునేవాళ్లు. ఒకరి విషయాలు మరొకరు పంచుకునేవాళ్లు. ఆందోళన, డిప్రెషన్ అనే మాటలకు తావుండేది కాదు. ఇప్పుడు కుటుంబంతో తీరిగ్గా గడిపే సమయం చిక్కింది. బాల్యస్మృతుల్ని నెమరేసుకునే వీలు కలిగింది.
కలిసి భోజనం..
ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేయడం వల్ల, లేదా టైమింగ్ సరిగా కుదరక పోవడం వల్ల.. కుటుంబసభ్యులందరూ కలిసి భోజనం చేయడం వీలుపడేదికాదు. కానీ, ఇప్పుడు ఇంటిల్లిపాది కలిసి హ్యాపీగా భోజనం చేస్తున్నారు. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా ఇంటి భోజనమే తింటున్నారు. టైమ్ టూ టైమ్ భోజనం చేసే అవకాశం చిక్కింది. ఒకప్పుడు ఇంట్లో బాధ్యతలను పంచుకున్నట్లే, ఇంటి పనులను పంచుకునేవాళ్లు. అందరూ కలిసి ఆడుతూ పాడుతూ పని చేసేవాళ్లు. ఆ రోజులు ఎప్పుడో అటకెక్కాయి. ఇప్పుడు ఒకరి మీద భారం వేయకుండా, ఒకరికొకరు సాయం చేసుకుంటూ పని చేసుకునే తీరిక దొరికింది. అలా చేస్తే పనులు కూడా త్వరత్వరగా అయిపోతాయి.
క్లాసిక్ బోర్డ్ గేమ్స్ బ్యాక్..
ఇప్పుడంతా ఆన్‌లైన్ గేమ్స్ హవానే. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి.. బోర్డు గేమ్స్‌కు కళొచ్చింది. మళ్లీ క్యారమ్స్, చెస్, అష్టాచమ్మా, పచ్చీస్, కైలాసం ఇలా పాతతరం ఆటల వైపు అందరూ దృష్టి సారిస్తున్నారు. ఇంటిల్లిపాది కలిసి ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు. అందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. కానీ టైమ్ లేకనో లేదా ఇతర వ్యాపకాల వల్లనో దానిపై అంతగా దృష్టి పెట్టరు. ఇప్పుడు ఆ టాలెంట్‌ను బయటపెట్టడానికి, దానికి మెరుగులు దిద్దడానికి కూడా టైమ్ వచ్చింది. కవితలు రాయడం, పెయింటింగ్స్ వేయడం, కళాత్మక వస్తువులు తయారు చేయడం, సంగీత వాయిద్యాలు ప్లే చేయడం ఇలా మనలో ఏ ప్రతిభ ఉన్నా ప్రపంచానికి చాటొచ్చు. పాత స్నేహితులతో ఫోన్లు మాట్లాడటం, పెట్స్‌తో మరింత టైమ్ స్పెండ్ చేయడం, యోగా, ఎక్సర్‌సైజ్ చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం, ఇంట్లో వాళ్లను మరింత ఎక్కువగా అర్థం చేసుకోవడం, ఇలా ఎన్నో ఎన్నో విషయాలను కరోనా మన ముందుకు తీసుకొచ్చింది.