- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా అనగానే భార్య వదిలేసింది
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ చిత్రవిచిత్రమైన అనుభవాలను అందుబాటులోకి తెస్తోంది. కరోనా అని తెలియగానే అంతవరకు కలిసి ఉన్న భర్తను నడిరోడ్డుపై వదిలేసి పరారైందో ఇళ్లాలు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం కరపకి చెంది 55 ఏళ్ల వ్యక్తి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ కాకినాడలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనికి రెండు రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిపోర్టులు వచ్చే వరకు కాకినాడ ఆసుపత్రిలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.
ఇంతలో డయాలసిస్ పూర్తయింది. అధికారులు చేసిన హెచ్చరికలు పెడచెవిని పెట్టి భార్యతో కలిసి ఇంటికి చేరేందుకు కాకినాడలో ఆర్టీసీ బస్సెక్కాడు. బస్సులో ఆర్టీసీ సిబ్బంది అతడి వివరాలను నమోదు చేసుకున్నారు. బస్సు కరప చేరుకుంటుందనగా బాధితుడికి కరోనా సోకినట్టు రిపోర్టులు వచ్చాయి. వారు బస్సు డ్రైవర్, కండక్టర్ వారిని బస్సులోంచి దించేశారు. బస్సులోంచి దిగిన భర్త అక్కడే ఉండగా, భార్య కనిపించకుండా పోయింది. దీంతో వైద్య సిబ్బంది అతనిని ఆస్పత్రికి తరలించి, ఆమె కోసం గాలిస్తున్నారు.