- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో జేబులు ఖాళీ
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ అనుకున్న దాని కంటే ఫాస్ట్‌గా తెలంగాణలో విస్తరిస్తోంది. హైదరాబాద్, మిగిలిన తెంగాణ జిల్లాల్లో కలపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం నాటికి 13కు చేరింది. అయితే, ఈ సంఖ్య చూడడానికి తక్కువగానే ఉన్నప్పటికీ ఒక్క కేసు నుంచి కొద్ది రోజుల్లోనే 13కు చేరడంతో ప్రభుత్వంతోపాటు మొత్తం రాష్ట్ర ప్రజలు అలర్ట్ అయ్యారు. ఒక్కొక్క కేసు పెరుగుతుంటే కరోనా వ్యాప్తి భయం ప్రజల్లో పెరుగుతోంది. ఈ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అనేక అంశాల్లో అంక్షలు విధించి స్పీడ్‌గా చర్యలు తీసుకుంటోంది. దీనికి ప్రజలు కూడా స్వచ్ఛంధంగా సహకరిస్తున్నారు. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకుండా అత్యవసరమైతేనే బయటికి వెళ్లి మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్నారు. ప్రజలు ప్రయాణాలు, సినిమాలకు వెళ్లడం, షాపింగ్ చేయడం, వేడుకలకు హాజరవ్వడం లాంటివి పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. ఈ నెల 31 వరకు సభలు, సమావేశాలపై నిషేధం విధించిన ప్రభుత్వం, మాల్‌లు, పబ్‌లు, బార్లు, థియేటర్లు, హోటళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న హైదరాబాద్‌లో ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోంది.
ఐటీ ఉద్యోగుల్లేక ఎఫెక్టవుతున్న బిజినెస్‌లు
హైదరాబాద్ అంటేనే సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కేంద్రం. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వేలసంఖ్యలో విస్తరించిన ఐటీ కంపెనీల్లో 5 లక్షల మందిదాకా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్రాంతాలు రోజులో 3 షిఫ్టులు పనిచేసే ఐటీ ఉద్యోగులతో ఎప్పుడూ సందడిగా ఉంటాయి. మిగతా కంపెనీలతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఇళ్ల నుంచే తమ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి భయంతో దాదాపుగా ఉద్యోగులందరినీ ఇళ్ల నుంచే పనిచేయమని ఐటీ కంపెనీలు ఆదేశిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగుల సందడి నగరంలో తగ్గిపోయింది. ఐటీ ఉద్యోగుల జీతాలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. వీరి కొనుగోలు శక్తి మిగతావారితో పోలిస్తే ఎక్కువే. ఇప్పడు ఈ ఉద్యోగులందరూ ఇళ్లకే పరిమితమవడంతో నగరంలోని ఐటీ ప్రాంతాల్లో పలు చిరు వ్యాపారాలు చేసుకునేవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలావరకు పెద్ద మాల్‌లలో వ్యాపారాలు, పబ్‌లు వారాంతాల్లో ఐటీ ఉద్యోగులతోనే కిటకిటలాడుతుంటాయి. ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతం ఇవీ మూతపడడంతో వీటిలో పనిచేసే చిరుద్యోగులు ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు. వీరి రోజువారి జీవితం తీవ్రంగా ప్రభావిమవుతోంది. పబ్‌లు, బార్లలో లిక్కర్ అమ్మకాలు ఆగిపోవడంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం పడిపోయింది.
హోటళ్లపై ఎఫెక్ట్..
కరోనా వ్యాప్తి భయంతో ప్రభుత్వం బార్లు, పబ్బులు మూసేయాలని ఆదేశించడంతో ఈ ప్రభావం హోటళ్లపై పడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ పేర్కొంటోంది. ప్రభుత్వం ఆదేశించినట్టుగా ప్రజారోగ్యం కోసం 15 రోజులు హోటళ్లు మూసివేయడంపై తమకు అభ్యంతరంలేదని కాకపోతే ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బ్యాంకు వడ్డీలు, ఉద్యోగుల జీతాల వంటి నెలవారీ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ హోటల్ అసోషియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరానికి వివిధ పనులు, పర్యటనల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందని వారు చెబుతున్నారు. వివిధ ప్లాట్ ఫామ్‌ల ద్వారా జరిగిన హోటల్ బుకింగ్‌లన్నీ టూరిస్టులు మూకుమ్మడిగా రద్దు చేసుకుంటున్నారని చెప్పారు. దీంతో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
పూర్తిగా పడిపోయిన క్యాబ్ బుకింగ్‌లు..
హైదరాబాద్ నగరంలో గత 5 సంవత్సరాల నుంచి ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసుల ట్రెండ్ ఊపందుకుంది. వినియోగదారులు ఫోన్‌లో క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కడికంటే అక్కడికి ఈజీగా ప్రయాణాలు సాగించేవారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికే జంకుతుండడంతో ఈ క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకునే వారే కరువయ్యారు. ఈ క్యాబ్ సర్వీసుల్లో బాగా పాపులర్ అయిన షేర్ క్యాబ్ బుకింగ్, ఎయిర్ పోర్టు బుకింగ్‌లైతే భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకు లోన్లపై క్యాబ్‌లు కొనుక్కొని జీవిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. బ్యాంకు లోన్ల వాయిదా కాదుకదా కనీసం రోజువారీ జీవితం గడపడానికి సరిపడా వ్యాపారం కూడా లేకుండా పోయిందని వారు అంటున్నారు. ప్రభుత్వం ఈ బ్యాంకు రుణాల విషయంలో మారటోరియం విధించే విషయం ఆలోచించాలని క్యాబ్ ఓనర్ల యూనియన్ ప్రతినిధులు కోరుతున్నారు.
మెడికల్ షాపులకు గిరాకీ..
కరోనా వ్యాప్తి భయంతో ప్రజలు మాస్కులు, పారాసిటమాల్ బిళ్లలు, శానిటైజర్లు, డెటాల్ వంటి సబ్బుల కొనుగోళ్లు పెంచారు. దీంతో మెడికల్ షాపుల వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోయింది. వీటి సప్లై డిమాండ్‌కు తగ్గట్టు లేకపోవడంతో మెడికల్ షాపులు ప్రజల నుంచి వీటి విషయంలో కాస్త ఎక్కువగానే డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాస్కులు, శానిటైజర్ల ధరలు ఒకప్పటితో పోలిస్తే భారీగా పెరిగాయి. ఇక చైనా నుంచి 70 శాతం వరకు దిగుమతి చేసుకునే ముడిసరుకుతో తయారయ్యే పారసిటమాల్ మాత్రల ధరలు కూడా 30 శాతం వరకు పెరిగినట్టు ప్రజలు వాపోతున్నారు.
Tags :
corona, telangana, employment, businesses shutdown