- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాద్రిలో 108కు కరోనా సోకింది!
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 108 సిబ్బందిపై కరోనా పంజా విసిరింది. జిల్లాకు చెందిన కొంతమంది సిబ్బంది ఇటీవల జీవీకే సంస్థ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించారు. ఇందులో 13 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో ఆరుగురు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరో ఆరుగురు భద్రాది జిల్లాలోనే మణుగూరు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఒకరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వాస్తవానికి 108 సిబ్బందికి పీపీఈ కిట్ల కొరత శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన కిట్లు లేకుండానే కరోనా అనుమానితులను తరలించాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు.
అనుమానిత కేసులన్నింటిని కూడా కరోనా కేసుగానే పరిగణించిన కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నా కొంతమంది సిబ్బంది కరోనా బారిన పడుతున్నారని జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న 108 సిబ్బంది పేర్కొంటున్నారు. 108 సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విధులు నిర్వహించుకుని ఇంటికెళ్లాక కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని, ఇంట్లో పిల్లలు దగ్గరకు వస్తున్నా.. వారిని దగ్గరగా తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దుస్తువులను శుభ్రపర్చుకోవడంతో పాటు ప్రత్యేక గది ఉంటే అందులోనే నిద్రిస్తున్నామని చెప్పుకొచ్చారు.
జీతాలు రాక.. ఆకలి కేకలు..
108 సిబ్బంది కరోనా బారిన పడకుండా ప్రభుత్వం పీపీఈ కిట్లను సమకూర్చాలని కోరుతున్నారు. అలాగే తమ కుటుంబాలకు పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. 108 అంబులెన్స్ పైలెట్లు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. అయితే కరోనాలాంటి అత్యంత విషమ పరిస్థితుల్లో కూడా ఆరోగ్య సంజీవని 108 సేవలను కొనసాగిస్తున్న సిబ్బందికి జీతాలు అందడం లేదు. జీతాలు అందక కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఇటు జీవీకే సంస్థకు, అటు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకునే నాథుడేలేడని పేర్కొంటున్నారు.