- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది అచ్చంపేట ముచ్చట
దిశ, అచ్చంపేట: కరోనా వ్యాధిని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఉప్పునుంతల మండలంలోని పలు గ్రామాలలో సర్పంచులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల నుండి గ్రామాలకు కరోనా వ్యాధి విజృంభణ కొనసాగుతుందని గుర్తుచేశారు.
మార్చి నెల నుంచి ఇప్పటివరకు గ్రామాలలో కూలీలకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా వ్యాధి నిర్మూలించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యా విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. గ్రామాలలో రైతులు, కూలీలు, వలస కార్మికులు స్థానికంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూలీలను ఆదుకునేందుకు స్థానికంగా పనులు కల్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రామ సర్పంచ్ లు కరోనా వ్యాధిని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చేలా గ్రామపంచాయతీ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.