Nizamabad Corona Cases : నిజామాబాద్‌లో కరోనా తగ్గుముఖం.. మంత్రి హర్షం

by Shyam |   ( Updated:2021-05-27 10:22:00.0  )
Minister Prashanth Reddy
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల శాతం 8కి పడిపోయిందని, దీనిని బట్టి జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు అర్థమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కొవిడ్ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో కలిపి కేవలం 374 మంది మాత్రమే కొవిడ్ పేషెంట్లు ఉన్నారని అన్నారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని, బ్లాక్ ఫంగస్ సోకిన వారు కూడా హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా జిల్లాలోనే 50 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్సలు తీసుకోవాలని సూచించారు.

బ్లాక్ ఫంగస్‌కు ఉపయోగపడే అన్ని రకాల చికిత్సలు, ఇంజక్షన్లు సమకూరుస్తామని, ఒక్కో పేషెంట్‌కు కనీసం రెండున్నర లక్షలకు పైగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లాలో 6000 సూపర్ స్ప్రెడర్లకు శుక్రవారం, శనివారాలు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. దాంతో వారి వద్దకు వచ్చే ప్రజలతోపాటు, వారి కుటుంబ సభ్యులకు వైరస్ బారినుంచి రక్షల కల్పించే అవకాశం ఉందని అన్నారు. ఈ సమీక్షలో జిల్లా వైద్యాధికారి బాల నరేంద్ర, సూపరింటెండెంట్స్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed