- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమానుషం.. సైకిల్ పైనే కరోనా శవం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మానవ సంబంధాలను మంటగలిపితే.. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మరిన్ని అమానుష ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి కనీసం ప్రత్యేకించి వాహనాలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబీకులు శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన హృదయవిదాకర ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
ಬೆಳಗಾವಿಯ ಕಿತ್ತೂರಿನ 70 ವರ್ಷದ ವೃದ್ಧನ ಶವವನ್ನು ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆಯುತ್ತಾ ಸೈಕಲ್ ನಲ್ಲಿ ಸಾಗಿಸಿದ್ದಾರೆ
ಸಿಎಂ @BSYBJP ಅವರೇ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ? ಅವರಿಗೆ ಏಕೆ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಒದಗಿಸಲಿಲ್ಲ?
ಈ ಅಸಮರ್ಥ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮಾನವೀಯತೆ ಇಲ್ಲವಾಗಿದ್ದು, ಪಿಡುಗು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನಿಭಾಯಿಸಲು ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿಫಲವಾಗಿದೆ pic.twitter.com/dZxCj9sO9P
— DK Shivakumar (@DKShivakumar) August 17, 2020
వివరాళ్లోకి వెళితే.. కర్ణాటకలోని బెల్గాం జిల్లా కిత్తూరులో ఓ 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించాడు. అయితే, ఆ శవాన్ని తరలించేందుకు అంబులెన్సు రాలేదు. దిక్కు తోచని పరిస్థితుల్లో పీపీఈ కిట్ ధరించుకున్న కుటుంబీకులు వృద్ధుడి శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లారు. ఈ అమానుష ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ లీడర్ డీకే శివ కుమార్ తన ట్విట్టర్‌లో సోమవారం షేర్ చేశారు.
ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘బెల్గాం కిత్తూర్‌కు చెందిన 70 ఏళ్ల శవాన్ని కుటుంబ సభ్యులు సైకిల్‌లో తరలించారు.. మీ ప్రభుత్వం ఎక్కడ ఉంది? వారు ఎందుకు అంబులెన్స్ ఇవ్వలేదు?.. ఈ అసమర్థ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. బెదిరింపును పూర్తిగా భరించలేకపోతోంది’ అంటూ యడియూరప్ప ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు.