బసంత్‌నగర్ టోల్‌గేట్‌లో కరోనా కలకలం

by Sridhar Babu |
Basantnagar tollgate
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి బసంత్ నగర్ టోల్‌గేట్ సిబ్బంది 10 మందికి కరోనా సోకింది. టోల్ గేట్ లో మొత్తం 130 మంది సిబ్బంది ఉండగా ఇప్పటికే 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్దారణ అయింది. అయితే సిబ్బంది అందరికీ పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కాగా దీనిపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లాక్ డౌన్ మొదట్లో సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేసిన యాజమాన్యం ఆ తరువాత వాటికోసం మొరపెట్టుకున్నా ఇవ్వడం లేదని తెలుస్తోంది. రోజు వేలాది వాహనాల నుండి సిబ్బంది టోల్ ఫీ వసూలు చేస్తోంది. మహారాష్ట్రలోని నాగ్ పూర్, గడ్చిరోలి జిల్లా మీదుగా తెలంగాణాలోకి వచ్చే ప్రధాన రహదారి రామగుండం రాజీవ్ రాహదారి కావడం విశేషం. ఇప్పటికి కరోనా సోకిన సిబ్బందికి ఎలా వచ్చిందన్నదే అంతుచిక్కకుండా తయారైంది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విజృంభిస్తుండడంతో అక్కడి నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి కరోనా సోకిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed