- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో భారత్‌లో 72వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నాటికి దేశంలో 72,330 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 11(74,383 కేసుల) తర్వాత ఆ స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే మహారాష్ట్రలో 39,544 కేసులు రిజిష్టర్ అయ్యాయి. చత్తీస్‌గఢ్ 4563, కర్ణాటకలో 4వేలకు పైగా కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,22,21,665కు చేరింది.
ఇక గత 24 గంటల్లో దేశంలో కరోనాతో 459 మంది మరణించారు. గతేడాది డిసెంబర్ 5 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అత్యధికంగా కరోనా మరణాలు కలిగిన రాష్ట్రాల్లో మహారాష్ట(243), పంజాబ్(55), చత్తీస్ గఢ్(39) కర్ణాటక(26), తమిళనాడు(19) ఉన్నాయని వెల్లడించారు. కాగా 14 రాష్ట్రాల్లో కరోనా మరణాలు నమోదుకాకపోవడం ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,62,927 మంది కరోనాతో మరణించినట్టు అధికారులు వివరించారు.