దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

by vinod kumar |   ( Updated:2021-07-29 23:33:57.0  )
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బుటిటెన్ ప్రకారం .. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,15,72,344కు చేరింది. ఇక నిన్న కరోనాతో 555 మంది మరణించగా అదే సమయంలో 42,360 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు3,07,43,972 మంది కరోనాను జయించగా, మరణాల సంఖ్య 4,23,217కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం 4,05,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story