కరోనా విజృంభిస్తోంది.. తెలంగాణలో డేంజర్ బెల్స్

by Anukaran |
కరోనా విజృంభిస్తోంది.. తెలంగాణలో డేంజర్ బెల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా డేంజర్​ బెల్స్ ను మోగిస్తోంది. జనవరి నాటికి పూర్తిగా తగ్గిపోయిందకున్న కరోనా 15 రోజుల నుంచి అంతకంతకూ రెట్టింపవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 392 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 43,846 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 1,15,99,130 మందికి కరోనా సోకగా శనివారం ఒక్క రోజే దేశంలో 197 మంది రోగులు కొవిడ్​తో చనిపోయారు. ఈ పరిస్థితులతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ అమలు జరుగుతుండగా, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనుందని ప్రశ్నార్థకంగా మారింది.

ఒక్క రోజులో 43,846 కేసులు

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనను కలిగిస్తున్నది. పరిస్థితి విషమిస్తే మళ్లీ ఎంతటి ఉపద్రవాలు ఎదురవుతాయోనని అందరిలో ఆలోచనలు మొదలయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.33లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా అత్యధికంగా 43,846 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. కొత్తగా 22,956 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. 15 రోజుల క్రితం దేశంలో 98శాతం వరకు ఉన్న కరోనా రోగుల రికవరీ సంఖ్య రానురాను తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఆదివారం నాటికి దేశంలో 95.9శాతానికి రికవరీ రోగుల సంఖ్య పడిపోయింది. శుక్రవారం 188 మంది కరోనాతో చనిపోగా శనివారం రికార్డు స్థాయిలో 197 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,755కి చేరుకుంది.

రాష్ట్రంలో రెట్టింపవుతున్న కరోనా..

ఈ నెల మొదటి నుంచి కరోనా కేసులు రోజురోజుకు రెట్టింపవుతున్నాయి. మార్చి 1న 116 కేసులు నుంచి 20 రోజుల్లోగా 394 కేసులకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 81 కేసులు నమోదుకాగా అత్యల్పంగా నారాయణపేటలో ఒక కేసు మాత్రమే నమోదైంది. వారం రోజుల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో 35 కేసులు, ఖమ్మంలో 4, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 12, రంగారెడ్డిలో 11, నిర్మల్ లో ఒక కేసు నమోదుకాగా ప్రస్తుతం వీటికి రెట్టింపు స్థాయిలో జీహెచ్ఎంసీలో 81కి కేసులు, ఖమ్మంలో 17 , మేడ్చల్ మల్కజ్ గిరిలో 34 , నిర్మల్ లో 10, రంగారెడ్డిలో 64 కేసులు నమోదయ్యాయి. ఒకవైపు కరోనా టీకా అందిస్తున్నాకాని కేసుల సంఖ్య పెరగడం ఆందోళనను కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,804 కరోనా ఆక్టీవ్ కేసులుండగా ముగ్గురు చనిపోయారు.

సరిహద్దు రాష్ట్రాల్లో లాక్ డౌన్

మహారాష్టలోని నాగపూర్, పుణె వంటి నగరాల్లో లాక్ డౌన్ విధించగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా పాక్షికంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ ను అమలు చేసేందుకు ఛత్తీస్​గఢ్​, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఆలోచనలు చేస్తున్నాయి. థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించాయి. రాత్రుళ్లు పూర్తిగా కర్ఫ్యూని విధించారు. కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారు. కొవిడ్​ అదుపులోనే ఉన్నా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోనుంది.

Advertisement

Next Story

Most Viewed