- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు నిల్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ అన్ని దేశాలకూ పాకింది. భారత్‌లో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం నాటికి 979 కేసులు నమోదు కాగా, 87 మందికి నయం కావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 25 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళలో 182 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 66, ఏపీలో 14 మందికి కరోనా నిర్ధారణ అయింది. అయితే, మన దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని రాష్ట్రాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?
దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో 22 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా పాకింది. కానీ, జార్ఖండ్ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో విశేషం ఏమిటంటే ఈ రాష్ట్రానికి దాదాపు ఆరు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. ఈ రాష్ట్రాన్ని ల్యాండ్ లాక్ స్టేట్ అని కూడా పిలుస్తారు. కానీ, ఇప్పటివరకు ఇక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఇది చాలా వెనుకబడిన రాష్ట్రం. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడానికి ఓ కారణంగా తెలుస్తుంది. మరోవైపు సెవన్ సిస్టర్స్‌గా పేరుగాంచిన ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్, మిజోరంల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. కానీ, మిగతా ఐదు రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయా, త్రిపుర, అసోం, నాగాలాండ్‌తోపాటు సిక్కింలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే జమ్ముకశ్మీర్‌లో 31, లద్దాఖ్ 13, అండమాన్ నికోబార్ 9, చండీగఢ్ 8, పుదుచ్చేరిలో ఒక్క కరోనా కేసు నమోదైంది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే భారత భూభాగానికి దూరంగా సముద్ర జలాల్లో ఉండే అండమాన్‌నికోబార్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం. మిగిలిన మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు లక్షదీవులు, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూలకు కరోనా పాకలేదు. దేశంలో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రకు దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూలు అతి సమీపంలో ఉండటం గమనార్హం.
Tags: corona out break, lock down, six states, three uts there is no corona cases