ఏపీలో కరోనా విలయతాండవం

by srinivas |   ( Updated:2020-06-26 04:25:11.0  )
coronavirus
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్ విలయతాండవమాడుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు రెట్టింపవుతున్నాయి. తొలుత కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ నెమ్మదిగా వ్యాపిస్తే.. ఇప్పుడు జోరుగా వ్యాప్తి చెందుతోంది. ఇంచుమించు అన్ని జిల్లాల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,305 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో 605 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 35 మంది కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన 570 లోకల్ కేసులే కావడం ఆందోళన రేపుతోంది.

దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 11,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 191 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో కరోనాకి చికిత్స తీసుకుని కోలుకుని 5,196 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా మరో 6,147 మంది కరోనాకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో కరోనా మరణాలు ఒక్కసారిగా పెరగడం వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపుతోంది. గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు ఇలా మొత్తం పది మంది కరోనాకి బలయ్యారు. దాంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 146కి పెరిగింది.

Advertisement

Next Story