- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెయ్యిదాటిన కరోనా కేసులు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కేసులు ఒక్క రోజులోనే 1078 కేసుల నమోదు కావడం ఆందోళనను కలిగిస్తుంది. గతేడాది నవంబర్ 19న 1110 కేసులు నమోదుకాగా ఆ స్థాయిలో తాజాగా కేసులు నమోదయ్యాయి. గత 4రోజుల నుంచి నిజామాబాద్,సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, నిర్మల్ జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 6 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1712కి చేరుకుంది. తాజాగా 62,581 మంది వ్యాక్సిన్ ను అందించడంతో మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 11,38,488కి చేరుకుంది.
ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికి రోజురోజుకు ఊహించని స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పీహెచ్ సీ స్థాయిలో పరీక్ష లు నిర్వహించిన వ్యాది సోకిన వారిని గుర్తించి హోం క్వారంటైన్ కావల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు. 45ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని క్షేత్ర స్థాయిలో అవగాహనలు చేపడుతున్నారు. గతేడాది నవంబర్ నుంచి జనవరి వరకు తగ్గతూ వచ్చిన వ్యాది ఫిబ్రవరి నెలఖరు నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. మార్చి నెల మొదట్లో 40 లోపు నమోదైన కేసులు ఏప్రెల్ మొదటి వారానికి 1000కి పైగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. జీహెచ్ఎంసీలో 283, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 113, రంగారెడ్డిలో 104కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలో కూడా అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గ్రామాలకు కరోనా వ్యాది పాకుతుండటంతో నిజామాబాద్ లో 75, జగిత్యాలలో 35, కరీంనగర్ లో 34, నల్గొండలో 33, నిర్మల్ లో 40, సంగారెడ్డిలో 46, ఆదిలాబాద్ లో 25 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కొమరంభీం ములుగులో 1, ఆసీఫాబాద్ లో 2, కొత్తగూడెంలో 6, జనగాంలో 8,, జోగుళాంబ గద్వాలలో 8, మహబూబాబాద్ లో 6, నారాయణపేటలో 7, వరంగల్ రూరల్ లో 8 కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24గంటల్లో 57,817 మందికి వ్యాక్సిన్
గడిచిన 24గంటల్లో మొత్తం 57,817 మందికి కరోనా వ్యాక్సిన్ ను అందించారు. వీరిలో మొదటి డోసు తీసుకున్నవారు 54,059 ఉండగా 2వ డోసు తీసుకున్నవారు 3,758 మంది ఉన్నారు, దీంతో ఇప్పటి వరకు మొత్తం 11,38,488 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందించగా రెండవ డోసును 2,45,936 మందికి అందించారు.