ఏపీలో 5వేలు దాటిన కరోనా కేసులు..

by Ravi |   ( Updated:2021-04-15 06:06:26.0  )
ఏపీలో 5వేలు దాటిన కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ :రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ జోరుగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో మొన్నటిదాక వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు 5వేలు దాటాయి. గురువారం తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఏపీలో 24గంటల వ్యవధిలోనే 5,086 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 14 మంది రోగులు చికిత్స పొందుతూ మరణించారు.

ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతరపురం, కర్నూలు విశాఖలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోగా, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక చిత్తూరులో అత్యధికంగా 835 కేసులు నమోదుకాగా, కర్నూలు-626, గుంటూరులో -611, శ్రీకాకుళం-568, తూర్పుగోదావరి -450, విశాఖ-432, కృష్ణాలో-396, అనంతపురంలో 336, విజయనగరం-248, ప్రకాశం-236, నెల్లూరు-232, కడప-96, పశ్చిమగోదావరి-31 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed