తెలంగాణలో కరోనా విజృంభణ.. 627 మంది మృతి

by Anukaran |
తెలంగాణలో కరోనా విజృంభణ.. 627 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,982 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదన కరోనా బాధితుల సంఖ్య 79,495కు చేరింది. ఇందులో 55,999 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 22,869 మంది భాదితులు చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో ఇప్పటివరకు 627 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్- 463, మేడ్చల్-141, రంగారెడ్డి-139 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story