పెళ్లి, శోభనం.. మధ్యలో కరోనా.. విరహ బాధల్లో వధూవరులు

by Anukaran |   ( Updated:2021-05-10 05:52:04.0  )
Honeymoon
X

దిశ, వెబ్‌డెస్క్ : కోటి ఆశలతో పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన తర్వాత.. అంటూ కొత్త జంటలు ఊహల్లో విహరిస్తారు. శోభనం.. హనీమూన్ అంటూ పెళ్లికి ముందే కలలు కంటారు. పక్కాగా ప్లాన్ చేసుకుని ప్రేమ యాత్రలు చేస్తారు. శోభనం రాత్రులను మరిచిపోలేని అనుభూతులుగా పదిల పరుచుకోవడానికి కొత్త టూరిస్ట్ ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇలాంటి వారందరికీ కరోనా సెకండ్ వేవ్ షాక్ ఇస్తోంది. నవ వధూవరులను విడదీసి గ్యాస్ పెంచుతోంది. దీంతో కొత్త జంటలు ఫోన్లలో ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ అంటూ వీడియో కాల్స్ చేసుకుంటూ విరహ బాధలతో తల్లడిల్లుతున్నారు.

అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న నూతన జంటలను కరోనా వెంటాడుతుంది. పెళ్లైన రెండు, మూడు రోజులకే వారికి కరోనా పాజిటివ్ వస్తుంది. దీంతో వధువరులు శోభనాన్ని, హనీమూన్ యాత్రలను వాయిదా వేసుకునే పరిస్థితులు వచ్చాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ జంట నేరుగా పసుపు బట్టలతోనే హోం ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ రాప్తినగర్‌లో ఉంటున్న సీనియర్ రైల్వే అధికారి కుమారుడికి మే 2న ఘనంగా వివాహం జరిగింది. ఆ తరువాత వధువులిద్దరినీ హనీమూన్ పంపించాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే వధూవరులిద్దరూ కరోనా బారిన పడ్డారని నిర్ధారణ అయ్యింది. దీంతో కొత్త జంట హోంఐసోలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది.

గీడా ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో మే 2న పెళ్లి వేడుక అంగరంగ వైభోవంగా అతిథుల మధ్య జరిగింది. కానీ వారి వివాహానికి అమెరికాకు చెందిన వారి బంధువుతో పాటు పలువురు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక్కడా శోభనం ఆగిపోయింది.

బిచియా క్యాంప్ లోని ఒక ఫ్యామిలీలో ఏప్రిల్ లో జరిగిన వివాహంలో కూడా కరోనా విషాదాన్ని నింపింది. పెళ్లి జరిగిక 10 రోజుల్లోనే ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో వివాహం జరిగిన ఇంట్లో విషాదం నిండుకుంది.

ఇలా కరోనా వివాహ వేడుకలకు పిలవని పేరంటంలా వచ్చి ప్రాణాలను తీసుకుంటుంది. వధూవరుల జాతకాలను మార్చుతోంది. సంతోషంగా జరగాల్సిన కార్యక్రమాలను అర్థాంతంగా నిలిచిపోయేలా చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed