భారత్‌లో కరోనావైరస్ కేసులు 60

by Shamantha N |
భారత్‌లో కరోనావైరస్ కేసులు 60
X

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19 వైరస్) సోకిన వారి సంఖ్య 60కి చేరింది. రాజస్తాన్‌లోని జైపూర్‌, ఢిల్లీలలో ఈ రోజు (బుధవారం) కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. జైపూర్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన 85 ఏళ్ల వృద్ధుడిని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మంగళవారం కేరళలో ఎనిమిది కరోనా కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కాగా, మన దేశంలో కరోనా వైరస్‌తో ఇదివరకు ఒక్క మరణమూ సంభవించలేదు. అయితే, కర్ణాటకలోని కల్బుర్గిలో కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి మరణించాడు. ఆ మరణం కరోనా వల్లేనా? కాదా? అనే విషయం ఇంకా నిర్ధారణ కావలసి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలు, టెర్రిటరీలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. సుమారు 1.19లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు 4,284 మరణాలు సంభవించాయి. కాగా, యూరప్ దేశమైన ఇటలీలో పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయి. అక్కడ ఒక్క రోజులోనే 168 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. దీంతో ఇటలీలో ఈ వైరస్‌తో మరణించినవారి సంఖ్య 631కి చేరింది. కాగా, ఈ దేశంలో దాదాపు 10 వేల మందికి ఈ వైరస్ సోకింది.

Tags: coronavirus, covid19, global, india, toll, spread, deaths, affect

Advertisement

Next Story

Most Viewed