- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లిపై అన్నీ అనవసర ఆరోపణలే: కార్నర్‌స్టోన్
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు ప్రఖ్యాతలు పాడుచేయాలనే ఉద్దేశంతోనే కొంత మంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కార్నర్ స్టోన్ సీఈవో బంటీ సెజ్దా అన్నారు. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ పేరుతో అనసరమైన ఫిర్యాదులు చేస్తున్నారని, అసలు కోహ్లికి ఈ విషయంతో సంబంధమే లేదని ఆయన అన్నారు. భారత జట్టు కెప్టెన్‌గా ఉంటూనే, పలువురు క్రికెటర్ల వ్యాపార, వాణిజ్య సంబంధాలను నిర్వహించే కార్నర్ స్టోన్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నాడని, ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని కోహ్లిపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సీఈవో బంటీ స్పందించారు. ఈ విషయంలో కోహ్లిని పదే పదే వివాదంలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారని బంటీ అన్నారు. కార్నర్‌స్టోన్ సంస్థకు ఇతర క్రీడాకారుల వ్యాపార కలాపాలను ఎలా నిర్వహిస్తుందో అదే విధంగా కోహ్లికి వ్యవహారాలను కూడా చూస్తున్నదని బంటీ స్పష్టం చేశారు. విరాట్ కోహ్లి స్పోర్ట్స్ ఎల్ఎల్‌పీ సంస్థ అతడి సొంత సంస్థ అని, దానికి కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధం లేదన్నారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని కోహ్లి ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.