క‌లాన‌గ‌ర్‌లో కార్డన్ సెర్చ్

by Sridhar Babu |
card-on-search-2
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ప్రజల భద్రతను మ‌రింత పెంపొందించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. శ‌నివారం హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని క‌లాన‌గ‌ర్‌లో ఇబ్రహింపట్నం ఏసీపీ బాల‌కృష్ణారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు సురేంద‌ర్‌గౌడ్‌, కోల స‌త్యనారాయ‌ణ‌, ర‌వికుమార్‌, ఎస్సైలు, ట్రాఫిక్‌, లా అండ్ ఆర్డర్, సీసీఎస్, ఎస్ఓటీ పోలీసుల‌తో స‌హా మొత్తం 100 తో కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. స్థానిక ప్రజలు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందించార‌ని పేర్కొన్నారు. వాహ‌నాల‌కు నెంబ‌ర్ ప్లేట్‌లు లేక‌పోవ‌డం వ‌ల్ల జ‌రిగే అనర్థాల‌ను వివ‌రించారు. సెల్‌ఫోన్ ద్వారా జ‌రిగే సైబ‌ర్ క్రైంకు మోస‌పోకుండా తీసుకునే జాగ్రత్తల‌ను తెలియ‌జేశారు. ప్రజ‌లు ఎప్పటిక‌ప్పుడు అప్రమ‌త్తంగా ఉంటూ ఏదైనా స‌మ‌స్య ఎదురైతే వెంట‌నే పోలీసుకు తెలియ‌జేయాల‌ని సూచించారు. కార్డన్‌సెర్చ్‌లో స‌రైన ప‌త్రాలు లేని 32 బైక్‌ల‌ను, 3 ఆటోల‌ను, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

card-22

card-on-search-1

Advertisement

Next Story

Most Viewed