- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పచ్చని కొండల్లో రక్త చరిత్ర
దిశ, వికారాబాద్ : ప్రకృతి రమణీయతకు నెలవు.. ఎటు చూసిన పచ్చందాలు.. లోయలు, ఘాట్ రోడ్.. కంటికి ఇంపైన దృశ్యాలు.. కేరాఫ్ అనంతగిరి కొండలు.. తెలంగాణ ఊటీగా పిలువబడే ఈ కొండల్లో వివిధ రకాల పక్షులు, జీవ జాతులు పర్యాటకులను అలరింపజేస్తాయి. ఇటీవలే సర్కార్ రూ.200 కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంది. హైదరాబాద్ కు 70 కిలోమీటర్లు దూరంలో వికారాబాద్ జిల్లా ఉంది. జిల్లా కేంద్రానికి 4 కి.మీ దూరంలో అనంతగిరి కొండలు ఉన్నాయి. ఇక్కడ 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం చుట్టూ 3600 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో చూడ చక్కని సుందరమైన అందాలను కనువిందు చేసే పర్యాటకం ఉంది. పర్యాటక ప్రదేశం కావడంతో హైదరాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు, యువత వస్తుంటారు. ప్రకృతితో అలరారే అలాంటి ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం హత్య, ఆత్మహత్యలకు కేరాఫ్‌గా మారింది. మర్డర్, సూసైడ్ లాంటి విషాదకర ఘటనలు సర్వసాధారణం అయ్యాయి. దీనంతటికీ కారణం అధికారుల నిర్లక్ష్యమే అని పలువురు అంటున్నారు.
పేరు పర్యాటకం.. జరిగేది అరాచకం..
ప్రతి శని, ఆదివారాలు, సెలవు దినాల్లో ఈ ప్రాంతం పర్యాటకులు, భక్తులతో అలరారుతుంది. వేలాది సంఖ్యలో జనాలు వస్తుంటారు. దేవుడి పేరు చెప్పుకుని అనంతగిరి వస్తున్నా, ఇక్కడ జరిగేవి మాత్రం ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలే. ఇక్కడకు వచ్చే యువత మద్యం సేవించడం, చుట్టూ ఉన్న రిసార్ట్స్ లో జల్సాలు చేయడం చేస్తుంటారు. మద్యం మత్తులో హత్యలు, ఆత్మహత్యలు ఇక పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు అనంతగిరిలో వందల సంఖ్యలో హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని, సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హత్య చేసి ఇక్కడ పాతిపెట్టడం, మృతదేహాలను పడేసి వెళ్లడం సాధారణమయ్యాయి.
నిఘా కరువు…
అనంతగిరి కొండల్లో దట్టమైన అడవి ప్రాంతం ఉండటం వల్ల పర్యాటక ప్రాంతంగా ఎంచుకొని ప్రజలు వస్తున్నారు. అదే అదునుగా మరికొందరు హత్యలకు, ఆత్మహత్యలకు స్పాట్‌గా వాడుకుంటున్నారు. ఎక్కడెక్కడో చంపేసి శవాల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయడానికి అనుకూలంగా ఉందని భావిస్తూ వారి వారి కార్యాల్ని చేసుకుంటున్నారు. నిర్మాణుష్య ప్రాంతం కావడం, నిఘా కొరవడడం వారికి కలిసొచ్చేవిగా మారింది. ఇక్కడ జరిగే చాలా చావులు పశువుల కాపరుల ద్వారా వెలుగుచూసినవే కావడం విశేషం.
అనంతగిరిలో కొన్ని సంఘటనలు…
* 17 జూన్ 2019 నరోత్తం రెడ్డి, శ్రీలత రెడ్డి దంపతులను హత్య చేసి మృతదేహాలను అనంతగిరి అటవీ ప్రాంతంలో పడేశారు.
* 2 మే 2020 రోజున కోటపల్లి మండలానికి చెందిన ప్రేమికులు శివ లీల, మహేందర్ ఆత్మహత్య చేసుకున్నారు. శివలీల వివాహిత మహిళగా పోలీసులు గుర్తించారు.
* 2 జూన్ 2020 రోజున నలుగురు మైనర్ యువకులు డ్రగ్స్, మద్యం తాగి మత్తులో డ్యూటీలో ఉన్న ఎస్సై కృష్ణ ను ఢీకొట్టారు. ఘటనలో ఎస్సై కాలు విరిగింది.
* జూన్ 3 2019 రోజున రేవ్ పార్టీకి అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు.
* 25 ఏప్రిల్ 2017 రోజు కోనేరులో సుదర్శన్ రెడ్డి, ప్రభావతి అనే భార్యాభర్తలు నీటిలో మునిగి చనిపోయారు. అది హత్యా, ఆత్మహత్యా అనేది అర్థం కాని పరిస్థితి.
* మొన్నటికి మొన్న వికారాబాద్ లో గాడిద పాలు అమ్ముకొని జీవనం కొనసాగించే వివాహితను భర్త హత్యచేసి అడవిలో పారవేశారు.
* రెండు రోజుల క్రితం అనంతగిరి కేరెల్లి ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం.
పూర్తిస్థాయిలో పెట్రోలింగ్ చేస్తున్నాం : వికారాబాద్ సీఐ రాజశేఖర్
జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరిలో ప్రతి రోజూ నిర్వరామంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. రోడ్ల వెంట సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. అనంతగిరి గుట్ట పైన ఒక ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పూర్తి స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేశాం. పర్యాటకులను ఎప్పటికప్పుడు నిఘా ద్వారా గమనిస్తున్నాం. అడవి ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం.