ఆ కరెంట్ బిల్లుతో ఓ ఇంటినే కట్టొచ్చు

by  |
ఆ కరెంట్ బిల్లుతో ఓ ఇంటినే కట్టొచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేడు నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనలు చేపట్టిన రోజే.. మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఓ వినియోగదారుడికి ఏకంగా రూ.25 లక్షల కరెంట్ బిల్లు బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె ఆగినంత పనయింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు కూడా షాక్ తిన్నారు.

హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో నివాసముండే ఓ వ్యక్తికి సాధారణంగా నెలకు రూ. 500-600 కరెంట్ బిల్లు వస్తుంది. ఇక వేసవిలో అయితే రూ.800 వరకు వస్తుంది. ఐతే లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలు బిల్లు తీయలేదు. అన్నీ కలిపి సోమవారం బిల్లు ఇచ్చారు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్టు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు. దీంతో ఒక్కసారిగా సదరు వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. అనంతరం అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. సాంకేతిక లోపంతోనే ఇలా జరిగి ఉంటుందని చెప్పారు. మీటర్‌ను టెస్టింగ్‌ కోసం పంపించారు.

ఆ కరెంట్ బిల్లుతో ఓ ఇంటినే కట్టొచ్చుకాగా, తెలంగాణలో విద్యుత్ బిల్లులకు నిరసనగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగానూ విద్యుత్ కార్యాలయాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శ్లాబుల రేట్లను పెంచి భారీగా బిల్లులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం వేసి.. మరింత ఇబ్బందుల్లోకి నెట్టారని మండిపడ్డారు. మూడు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed