పండుగ సీజన్‌లో ఈ వస్తువలకు ఫుల్ డిమాండ్

by Harish |
పండుగ సీజన్‌లో ఈ వస్తువలకు ఫుల్ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ గృహోపకరణాల పరిశ్రమ అమ్మకాలు ఈ ఏడాది పండుగ సీజన్‌లో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నాయి. ఏడాది కాలంలో ఇన్‌పుట్ ఖర్చులు రెండుసార్లు పెరగడం, చిప్‌సెట్, విడిభాగాల కొరత, కొవిడ్ మహమ్మారి మూడో వేవ్ ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ భావిస్తోంది. ఈ పరిశ్రమలో దిగ్గజ సంస్థలైన పానసోనిక్, ఎల్‌జీ, హైయర్, గోద్రెజ్ అప్లయన్సెస్, లాయిడ్స్ లాంటి తయారీ కంపెనీలు పెద్ద సైజ్ టీవీలు, ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్, అధిక సామర్థ్యం కలిగిన రిఫ్రిజిరేటర్ల వంటి ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, మెరుగైన వృద్ధిని సాధించే అవకాశం ఉందని భావిస్తున్నాయి.

ఇప్పటికే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను పటిష్టం చేశాయి. దసరా నుంచి దీపావళి వరకు సాధారణ అమ్మకాల కంటే 30 శాతం ఎక్కువ విక్రయాలు నమోదవుతాయని కంపెనీలు తెలిపాయి. 4కె ఆండ్రాయిడ్ టీవీలు, కనెక్టివిటీ ఉండే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్, ఇంకా ఇతర ఇంటి అవసరాలకు వాడే ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని పానసోనిక్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ మనీష్ శర్మ చెప్పారు. ఇది గతేడాది కంటే ఈసారి 25 శాతం ఎక్కువ వృద్ధిని సాధించామని ఆయన పేర్కొన్నారు. పండుగ సీజన్‌లో మరింత పెరుగుతుందన్నారు. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ పండుగ సీజన్‌లో వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉందని లాయిడ్ సీఈఓ శశి అరోరా వెల్లడించారు. కాగా, కొవిడ్‌కి ముందు 2019లో భారత గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సుమారు రూ. 76,400 కోట్ల మార్కెట్‌గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed