- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం
దిశ, దుబ్బాక : దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా రాయపోల్, దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చెరుకు ముత్యంరెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్ధిగా శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేసిన తర్వాత దుబ్బాకలో పరిస్థితులు మారాయన్నారు. గతంలో దుబ్బాకలో కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని.. ఇప్పుడు అలాంటివి జరగకుండా చూసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అభ్యర్థిని చూసి ఓటేయాలి కానీ, హరీష్రావు అహంకారంతో తనను చూసి ఓటేయమనడం సిగ్గుచేటని విమర్శించారు. రాయపోల్ మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదని.. కొత్త ఇళ్లు కట్టకపోగా దళితుల ఇళ్లు కూలగొట్టారని మండిపడ్డారు.