- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 19న కాంగ్రెస్ రాజీవ్ సద్భావన యాత్ర
దిశ, తెలంగాణ బ్యూరో: చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ఈ నెల 19వ తేదీన నిర్వహిస్తున్నామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. గాంధీ భవన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 31 ఏండ్లుగా రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ తేదీనే రాజీవ్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి జంట నగరాల్లో సద్భావన యాత్రను ప్రారంభించారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి చార్మినార్ వద్ద కాంగ్రెస్పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.
ప్రతి సంవత్సరం ఒక ప్రముఖుడికి రాజీవ్ సద్భావన అవార్డు ఇస్తున్నామని, ఈ సారి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి వీరప్పమొయిలీకి ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు, శ్యామ్ పిట్రోడాకు అందించినట్లు చెప్పారు. అనంతరం రాజీవ్ సద్భావన బ్రోచర్ ను ఆయన విడుదల చేశారు. ఈ సద్భావన యాత్రలో ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీనివాస కృష్ణన్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు హన్మంత్ రావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు దామోదరం రాజ నరసింహ, గీతా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మొహమ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎంఏ ఖాన్, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, పీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొంటారని నిరంజన్పేర్కొన్నారు.