పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతల ఆందోళన

by Shamantha N |
పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గౌరవ్ గొగోయి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్ చేశారని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఢిల్లీ ఘటనపై చర్చించాలన్న అంశాన్ని తాము లేవనెత్తితే సస్పెండ్ చేయడం దారుణమని, సస్పెండ్ చేసినంత మాత్రనా మేం భయపడబోమని అన్నారు. ఢిల్లీ ఘటనపై చర్చ చేపట్టాలని నిరంతరం పార్లమెంటులో లేవనెత్తుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను గురువారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.

Tags: congress, mps, suspension, parliament

Advertisement

Next Story