కేసీఆర్‌ను గద్దెదించేవరకు కాంగ్రెస్ పోరాటాలు- వీర్లపల్లి శంకర్.

by Shyam |
shanker
X

దిశ, షాద్ నగర్: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇంటికి సాగనంపేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఆగవని షాద్ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలపరిధిలోని సంతపూర్, పోమాల్‌పల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోమాల్‌పల్లిలో హారతులు పట్టి మహిళలు శంకర్‌కు స్వాగతం పలికారు. వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రగతిభవన్‌లో కూర్చుని, ఫామ్‌హౌస్‌లో పడుకుని రాజ్యాంగ బద్దంగా కాకుండా, తన ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ మాత్రమే పథకాలు అమలుచేస్తూ ప్రజాధనంను ఇష్టారీతిగా తన అభ్యర్థుల గెలుపుకోసం ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. దళిత బంధును రాష్ట్రమంతా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశ్, ఎంపీటీసీ కె.రాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, మండల ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అనుమగళ్ల రమేష్, ఎస్ టి సెల్ అధ్యక్షుడు రూప్లానాయక్, నాయకులు బాబర్ ఖాన్, జగదీశ్వర్, రాంరెడ్డి, గిరియాదవ్, పురుషోత్తం రెడ్డి, కొమ్ము కృష్ణ, యారం భాస్కర్ రెడ్డి, సాజిద్, మహేష్, కోడూరు రాములు, తైద పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story