- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోరాటాలు పక్కా ప్లాన్ వేసిన కాంగ్రేస్.. ఏంటా నిర్ణయాలు ?
దిశ, తెలంగాణ బ్యూరో : ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఫిర్యాదుల నుంచి పోరాటం వరకు అన్ని రకాల కార్యాచరణకు సిద్ధమవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారుల విషయంలోనూ ప్రజల నుంచి ఒత్తిడి పెరిగేలా పోరాట రూపాన్ని ఎంచుకోవాలని తీర్మానించింది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లతో కూడిన కోర్ కమిటీ సమావేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. గాంధీ భవన్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్సులో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 18న మహేశ్వరంలో జరిగే దళిత-గిరిజన దండోర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపైనా చర్చ జరిగింది.
ఈ నెల 9వ తేదీన ఇంద్రవెల్లిలో జరిగిన దళిత-గిరిజన దండోరా విజయవంతమైందని, ఇందుకు సహకరించిన పార్టీ ప్రతినిధులకు,కార్యకర్తకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ వారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో భాగంగా శనివారం జరిగిన మీటింగులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచాలని, కేంద్రస్థాయిలో ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజలతో పోరాటాలకు ప్లాన్ చేయాలని నిర్ణయించింది. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే ప్రభుత్వ ఉన్నతాధికారుల విషయంలోనూ గట్టిగానే వ్యవహరించాలని, ప్రజల నుంచి ఒత్తిడి పెరిగేలా పోరాడాలని నిర్ణయించారు.