కాపలా కుక్కలా ఉంటానని ఏం చేస్తున్నారు ?

by Shyam |
కాపలా కుక్కలా ఉంటానని ఏం చేస్తున్నారు ?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉద్యమకారులను అణచివేసి, ప్రతిపక్షాల హక్కులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి శాశ్వత విముక్తి కోసం తుది దశ పోరాటం జరగాలని, ఏ పదవి లేకపోయినా కేసీఆర్‌పై పోరాటానికి సిద్ధమని తేల్చి చెప్పారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌కు రాజకీయ పార్టీ సరిపోదని, రాజకీయాలకు అతీతంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని కోరారు.

పోతిరెడ్డిపాడుకు వైఎస్ బొక్క పెడితే.. జగన్ దాన్ని పెద్దగా చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణ ఎత్తిపోసుకుంటున్నది కేవలం ఒక్క టీఎంసీ మాత్రమేనని, ఏపీ 12టీఎంసీలు ఎత్తిపోసుకునే పనులు చేస్తుందన్నారు. అదే క్రమంలో పవర్ ప్రాజెక్టులను చంపే కుట్రలు జరుగుతున్నాయన్నారు. పాత విద్యుత్ ప్రాజెక్టులను చంపి, కొత్తవి కట్టాలని ప్లాన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేసిన వారిని వదిలిపెట్టి పెట్టుబడిదారులకు టికెట్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఉద్యమకారులను తరిమికొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి… ఆయన కొడుక్కు ఎంపీ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed