- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"ఒక్క" ఓటు తేడాతో బీజేపీ చేతిలో ఓడిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్ధి
దిశ, వెబ్ డెస్క్ : ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంత విలువ ఉందో చెప్పే సంఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ లో కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ వార్డ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్ధి వేణుగోపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో బీజేపీ చేతిలో వేణుగోపాల్ ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకుంది. కానీ అక్కడే ఏం జరిగిందో నాకు తెలియందు. బీజేపీ నుంచి ఎలాంటి సమస్య లేదు. కానీ నాకెందు ఓటింగ్ మిషన్ పై అనుమానంగా ఉంది. బహుశా అందుకేనేమో ఒక్కఓటుతో తన ప్రత్యర్ధి గెలిచారని అన్నారు. ఓటింగ్ మిషన్ అంశంపై కోర్ట్ కు వెళ్లాలా..! వద్దా అనే అంశంపై నేనింకా ఆలోచించలేదు. మరోసారి ఓట్ల లెక్కింపు చెక్ చేసి నిర్ణయం తీసుకుంటానని అన్నారు కొచ్చి కాంగ్రెస్ మేయర్ అభ్యర్ధి వేణుగోపాల్.