- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ ఇద్దరు కాంగ్రెస్ నేతలకు కరోనా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, శశిథరూర్‌లూ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని వారు నేరుగా ట్విట్టర్‌లో వెల్లడించారు. వీరిరువురూ వరుసగా బెంగాల్, కేరళలో ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ‘నాకు కరోనా పాజిటవ్‌గా తేలింది. వారం నుంచి నాతో కాంటాక్ట్‌లోకి వచ్చినవాళ్లు కొవిడ్ ప్రొటోకాల్ అనుసరించండి. ఆన్‌లైన్ వేదికల ఆధారంగా ప్రచారాన్ని కొనసాగిస్తాను. అందరూ కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ట్వీట్ చేశారు. ‘టెస్టు కోసం రెండు రోజులు వేయిట్ చేసి, రిజల్ట్ కోసం మరో రోజున్న ఎదురుచూసిన తర్వాత నాకు ఫలితం వచ్చింది. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వైరస్‌ను పాజిటివ్ మైండ్‌తో ఎదుర్కొంటానని భావిస్తున్నాను. నాతోపాటు నా సోదరి, 85 ఏళ్ల తల్లి కూడా కరోనాబారినపడ్డారు’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరరూర్ వెల్లడించారు.